ట్రంప్ ను ఓడించేందుకు కలిసి రండి!
నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు అమెరికాలోని వామపక్ష శక్తులన్నీ తనతో కలిసి రావాలని డెమొక్రాటిక్ పార్టీ నేత, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం జోబిడెన్‌కు దాదాపుగా ఖరారయింది. మార్చి నెలలో జరిగిన 26 ప్రైమరీలలో ఏడింటిలో విజయం సాధించి, దాదాపు 300కు పైగా డెలిగేట మద్దతు సాధించినప్పటికీ, ఇతర ప్రైమరీలలో వెనుకబడిన బెర్నీ శాండర్స్ ఆ తేడాను భర్తీ చేసుకోలేకపోయారు. పరిస్థితిని గమనించిన శాండర్స్ అభ్యర్థిత్వ రేసునుండి తప్పుకుని జోబిడెన్‌కు మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో త్వరలో చేపట్టనున్న ప్రచార కార్యక్రమానికి విధాన రూపకల్పనకు నిర్దేశించేందుకు ఇరువురు నేతలూ ఆరు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత వర్కింగ్ గ్రూపులు శాండర్స్ ఆలోచనలు పరిశీలించి బిడెన్ తరపు ప్రచారాన్ని, అందుకు సం•ంధించిన అజెండాను రూపొందిస్తారు. ఈ సమయంలోనే తన విజయానికి సహకారం అందించాలని బిడెన్ వాపమక్ష శక్తులను కోరారు. తన ప్రచార కూటమితో చేతులు కలపాలని లైఫ్ట్ని ఆహ్వానించిన బిడెన్ అందుకు వారికి అవసరమైన మినహాయింపులు, ఇతర రాయితీలు ప్రకటించారు. శాండర్స్ తన పనితీరు ద్వారా ఈ తరం అమెరికన్లలో భారీ ఆశలు రేకెత్తించారన్న విషయాన్ని అర్ధం చేసుకున్న బిడెన్, శాండర్స్, ఆయన తరపు బృందాల సహకారాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.













