అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు సెనెటర్ బెర్నీ శాండర్స్ ప్రకటించారు. 2016లో డెమోక్రాట్ పార్టీ తరపున బరిలోకి దిగి గట్టి పోటి ఇచ్చిన శాండర్స్ మరోసారి పోటీలో నిలుస్తున్నారు. స్వంత రాష్ట్రమైన వెర్మాంట్లో రేడియో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ముందుగా ఈ విషయాన్ని తన రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. తాను ఎలా ప్రచారం చేయబోయేది కూడా ఆయన వివరించారు. న్యాయం పట్ల, కమ్యూనిటీ పట్ల, కిందిస్థాయి రాజకీయాల పట్ల నమ్మకం వుండాలనే విలువలను తాను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తానని చెప్పారు. తాను నమ్మేవాటినే చెబుతానని చెప్పారు. ట్రంప్ ఒక అబద్దాల కోరని, దేశానికి ఇబ్బందికరంగా పరిణమించాడని వ్యాఖ్యానించారు. ఆయనో జాత్యంహంకారి అని విమర్శించారు.













