CTA: షార్లట్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని షార్లట్ నగరంలో తెలంగాణ సంస్కృతి, తెలుగు సంప్రదాయాలను చాటుతూ బతుకమ్మ (Bathukamma) మరియు దసరా (Dasara) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. షార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబురాలను అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ కొండ్రెడ్డి పర్యవేక్షించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను (Bathukamma) పేర్చి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలతో పాటు కోలాటం, దాండియా నృత్యాలతో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా షార్లెట్ నగరంలోని తెలంగాణ వాసులు ఉత్సవ వాతావరణంలో మునిగిపోయారు. ప్రవాసంలో ఉన్నప్పటికీ తమ సంస్కృతిని కాపాడుకోవాలనే తపనను ఈ బతుకమ్మ (Bathukamma) వేడుకలు ప్రతిబింబించాయి. సునీల్ కొండ్రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ బతుకమ్మ–దసరా సంబురాలు షార్లెట్‌లోని తెలుగు ప్రజలకు గొప్ప అనుభూతిని అందించాయి.