బాటా ‘పాడాలని ఉంది’…సూపర్

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన కరోవోకె కార్యక్రమంలో పలువురు గాయకులు పాల్గొని అమరగాయకుడు ఘంటసాల, మహానటి సావిత్రికి నివాళులు అర్పించారు. బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత కార్యక్రమంలో పాల్గొంటున్న అతిధులను, గాయనీగాయకులను ఆహ్వానించారు. శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ టీవి నాగేంద్ర ప్రసాద్, మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండి, సతీష్ గణేశన్, వేణు ఆసురి, మూర్తి వాడ్రేవు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చారు. ఘంటసాల స్వరం…ఆయన పాడిన పాటలు అజరామరమని, సావిత్రి నటన ఎన్నటికీ మరిచిపోలేనిదని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాటా టీమ్‌ను వారు అభినందించారు.
ఈ సందర్భంగా విజయ చాముండి, సతీష్ గణేశన్ తమ తల్లి సావిత్రితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పలువురితో పంచుకున్నారు. బాటా అడ్వయిజర్ ప్రసాద్ మంగిన ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేటర్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గాయనీ గాయకులు పాడిన పాటలు అందరినీ మైమరపింపజేశాయి. ప్రసాద్ సింహాద్రి, శ్రీధర్ గణపతి, కృష్ణ రాయసం, త్రినాథ్ రావు, రవి టాటా, శారద భాగవతుల, మానస గాడేపల్లి, విజయ గోపరాజు, శేష్ ప్రసాద్, సంజన తొడుపునూరి, మాధవ్ దంతూరి, అభిజిత్ వేములపాటి, మూర్తి సంబర, అభినయ్ సర్గం, హంసిని తిరుమల సెట్టి, జయదేవ్, శోహిణి చక్రవర్తి, అనిక ప్రసాద్, అంకిత జగన్, కవిత కొండపల్లి, జానకి నిట్టల, మాల తంగిరాల, నవీన్, మాధవి, బాలాజి తమిరిశ, శ్రీని, ప్రశాంత్ ఇవటూరి, శ్రీవిద్య, ప్రసాద్ మంగిన పాటలను పాడారు.
బాటా అధ్యక్షుడు యశ్వంత్ కుదరవల్లి, హరీష్ చికోటి (వైస్ ప్రెసిడెంట్) సుమంత్ పుసులూరి (సెక్రటరీ), కొండల్ కొమరగిరి (ట్రెజరర్), అరుణ్ రెడ్డి (జాయింట్ సెక్రరీ), స్టీరింగ్ కమిటీ రవి తిరువీధుల, కామేశ్ మల్ల, కళ్యాణ్ కట్టమూరి, శిరీష బత్తుల, అడ్వయిజరీ బోర్డ్ – జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, కరుణ్ వెలిగేటి, కల్చరల్ కమిటీ సభ్యులు- శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, దీప్తి సత్తి నామినేటెడ్ కమిటీ సభ్యులు హరి సన్నిధి, వరుణ్ముక్క తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలియజేశారు.










































































