విద్యార్థులకు సాయంకోసం రంగంలోకి దిగిన ఆటా
అమెరికాలో తెలుగు విద్యార్థులను ఫేక్ యూనివర్సిటీ ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేయడంతో ఆ విద్యార్థులను ఆదుకునేందుకు, అవసరమైన చట్టపరమైన చర్యలకోసం అమెరికా తెలుగు సంఘం (ఆటా) రంగంలోకి దిగింది. ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ అరెస్టయిన విద్యార్థులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ నగరాల్లో ఉన్న ఆటా టీమ్‌ను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. మరోవైపు అట్లాంటాలో ఉన్న ఇండియన్ అంబాసిడర్ హర్షవర్థన్ షింగ్లాను, స్వాతి విజయ్ కులకర్ణిని ఆటా నాయకులు కలిశారు. అరెస్టు అయిన విద్యార్థులను ఆదుకోవాలని, అందుకు అవసరమైన చర్యలను చేపట్టాల్సిందిగా కోరారు.
ఇమ్మిగ్రేషన్, న్యాయ సహాయం ఇతర వివరాలకు సంబంధించి ఆటా ఇచ్చిన Registration లింక్ ద్వారా తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాల్సిందిగా సూచించింది.
https://tinyurl.com/ATA-Immigration-Help













