‘అటా-టాటా’ సంయుక్త సమావేశాలు
అమెరికా తెలుగు సంఘం(అటా), తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్(టాటా) తొలిసారి సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికా తెలుగు కన్వెన్షన్ కోసం భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా భారీ సభను కూడా రెండు సంఘాలు నిర్వహిస్తున్నాయి. సభానిర్వహణ కోసం నిధుల సేకరణ నిమిత్తం టెక్సాస్‌లో ఇటీవల డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ రెండు సంఘాల వ్యవస్థాపక సభ్యులైన పైళ్లా మల్లా రెడ్డి, హనుమంతరెడ్డి మాట్లాడుతూ రెండు సంఘాల మధ్య మంచి స్నేహం భావం పెంపొందాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాము చేపట్టాలనుకున్న సభకు భారీ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు.
ఈ సభ ద్వారా మన సంస్కృతిని తెలియజేయడంతో పాటు సకుటుంబ సమేతంగా, స్నేహితులతో హాజరుకావడం ద్వారా కుటుంబ విలువలను చాటి చెప్పాలనుకుంటున్నమన్నారు. ఆహూతులను అలరించేలా వివిధ వినోద కార్యక్రమాను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సభ ఏర్పాట్లను అటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, టాటా అధ్యక్షుడు హరినాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలోని జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అజయ్ రెడ్డి, అరవింద్ ముప్పిడి,భరత్ మదడి, ధీరజ్ ఆకుల, జ్యోతి రెడ్డి, కిరణ్ రెడ్డి పాశం, మోహన్ పటోళ్ల, రఘువీర్ బండారు, మహేశ్ ఆదిభట్ల, సతీశ్ రెడ్డి, శ్రీనివాస్ అనుగు, విక్రమ్ జనగామ్ తదితరులు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఈ కన్వెన్షన్‌కోసం వివిధ నగరాల్లో సమావేశాలను కూడా ఈ సంఘాలు నిర్వహించాయి.













