యాపిల్, గూగుల్ కరోనా ట్రాకింగ్ టూల్
యాపిల్, గూగుల్ కొత్తగా కరోనా వైరస్ ట్రాకింగ్ టూల్‌ని లాంచ్ చేశాయి. ఇప్పటికే భారత్‌లో ఆరోగ్యసేతు యాప్ ప్రజలకు అందుబాటులో ఉంది. తమ కరోనా ట్రాకింగ్ టూల్‌ని అమెరికాలో 22 రాష్ట్రాలతో పాటు సుమారు 22 దేశాలు ఉపయోగిస్తున్నాయని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తున్న ప్రభుత్వ సంస్థల పేర్లను వెల్లడించేందుకు నిరాకరించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య శాఖ సంస్థలన్నీ ఉపయోగించుకోవడానికి అనువైనవిధంగా సాఫ్ట్‌వేర్‌ను లాంచ్చేశామని, ఈ యాప్ కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి తోడ్పడతాయని యాపిల్, గూగుల్ పేర్కొన్నాయి. స్మార్ట్ఫోన్లలో బ్లూటూత్ రేడియోస్ని వినియోగించే ఎక్స్పోజివ్ నోటిఫికేషన్ తమదని యాపిల్, గూగుల్ ప్రకటించుకున్నాయి. ఈ ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో తమ ఫోన్లను అప్డేట్ చేసుకున్నవారు బ్లూటూత్ సిగ్నల్‌ని షేర్ చేసుకోగలుగుతారని ఈ సంస్థలు వివరించాయి. గూగుల్‌లోని ప్లేస్టోర్‌లో, యాపిల్ యాప్‌స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించాయి.













