అమెరికా బంధనాల నుంచి ఆరుగురికి విముక్తి : రవి వేమూరి
ఫార్మింగ్టన్ నకిలీ విశ్వవిద్యాలయ వ్యవహారంలో అమెరికా పోలీసుల వలలో చిక్కిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ఏపీఎన్ఆర్టీ చర్యలు ముమ్మరం చేసింది. అక్కడి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఎమ్) అధికారుల నుంచి తాఖీదులు అందుకున్న 130 మంది వ్యక్తిగతంగా లాయర్లు నియమించి న్యాయసాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఓహియో డిటెన్షన్ కేంద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురికి విముక్తి కల్పించింది. బెయిలు, అపరాధ రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే వీరు స్వదేశానికి వెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరి రవికుమార్ తెలిపారు. మిగతా విద్యార్థుల తరపున వాదనలు వినిపిస్తున్నట్లు చెప్పారు.













