కరోనా సంక్షోభంలో…ఎన్నారైలను ఆదుకుంటున్న ఎపిఎన్ఆర్టీ
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రుల భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ఆంధప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) ప్రకటించింది. రాష్ట్రానికి వచ్చే ప్రవాసాంధ్రులు ప్రయాణ మార్గదర్శకాలు తెలిపేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ విమానాలు రద్దవడంతో విదేశాల్లో చిక్కుకుపోయిన పోయినవారిని స్వదేశం రప్పించేందుకు ఎపిఎన్ఆర్టీ కృషి చేస్తుందని ఎపిఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ మేడపాటి తెలిపారు. అంతర్జాతీయ విమానాల సర్వీస్‌కు అనుమతి వచ్చిన వెంటనే వారిని ఇండియాకు తీసుకువస్తామని చెప్పారు.
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఆ దేశంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని, కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన కోరారు. విదేశాల్లోని ఎన్నారైలకోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసిందని కూడా వెంకట్ మేడపాటి తెలిపారు. లండన్‌లోనూ ఇతర దేశాల్లోనూ చిక్కుకున్నవారిని, అమెరికాలో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వెంకట్ మేడపాటి తెలిపారు. ఎపిఎన్ఆర్టీ ద్వారా వారిని ఆదుకుంటామని చెప్పారు.
హెల్ప్ లైన్ నెంబర్
ఏపీ ఎన్ఆర్టీఎస్ 0863-2340678,
91-85002 27678
ఆంధప్రదేశ్ ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ 0866-2410978
భారతదేశ హెల్ప్ లైన్ నంబర్ 91-11-23978046













