మృతదేహాల కోసం వినతి
అమెరికాలో హత్యకు గురైన శశికళ, అనీష్ సాయి మృతదేహాలను ఆంధ్రప్రదేశలోని వారి బంధువులకు అప్పగించేందుకు సహకరించాలని అమెరికాలో భారతరాయబారి రివ గంగూలీదాస్కు ఏపీ భవన అదనపు కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత లేఖ రాశారు. ఈ కేసు విచారణ నిమిత్తం హనుమంతరావును అమెరికాపోలీసులు అదుపులోకి తీసుకున్నందున.. మృతదేహాల గురించి ఏపీలోని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వ సహాయం కోరారనిపేర్కొన్నారు. న్యూజెర్సీ పోలీసులను సంప్రదించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు సహకరించాలని కోరారు.







