పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక
భారత్‌పై మరోసారి ఉగ్రదాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్‌ను అమెరికా గట్టిగా హెచ్చరించింది. ఉగ్రవాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిపై తిరుగులేని చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కరే తాయిబా వంటి ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. లేకపోతే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ జాబితాలో చేరుస్తామని హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌పై మరోసారి ఉగ్రవాడి జరిగితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని, ఈ పరిణామం రెండు దేశాలకు ప్రమాదకరమని, ముఖ్యంగా పాక్‌కు కష్టాలు తప్పవని ట్రంప్ ప్రభుత్వంలోని ఓ అధికారి హెచ్చరించారు.













