ఎన్ఆర్ఐలకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు
కెనడా, అమెరికా వెళ్లే ఒసిఐ కార్డ్ హోల్డర్స్, భారతీయులు వందేభారత్ మిషన్ సూచనల మేరకు ఎయిర్ ఇండియా వెబ్సైట్లో టిక్కెట్లను నమోదు చేసుకోవాలని ఎయిర్ ఇండియా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 11న ప్రయాణికులు స్థానిక హై కమిషన్లో రిజిస్ట్రర్ చేసుకోవాలని ఎయిర్ ఇండియా ప్రతినిధులు సూచించారు. అలాగే ఈ నెల 14న న్యూయార్క్, ఎన్జె (ఇడబ్ల్యుఆర్) నుండి హైదరాబాద్ (హెచ్వైడి)కు స్వదేశానికి తిరిగి వచ్చే ప్రైవేట్ చార్టర్ డైరెక్ట్ ఫ్లైట్ ఎ 330 కోసం నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన భారత రాయబార కార్యాలయ మార్గదర్శకాల పరిశీలించాలని తెలిపారు.













