గ్లకోమాను తగ్గించే వేడి వేడి చాయ్
రోజు ఒక కప్పు వేడి వేడి చాయ్ తాగితే నేత్ర సంబంధిత వ్యాధి గ్లకోమా ను తగ్గించుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. దృష్టి నాడులను పాడుచేసి, దృష్టి లోపానికి కారణమయ్యే ఈ వ్యాధికి చాయ్ మంచి విరుగుడు అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, డీకాఫినేటెడ్, కాఫినేటెడ్ కాఫీతో గానీ, డీకాఫినేటెడ్ చాయ్, చల్లని చాయ్‌తో గ్లకోమాను తగ్గించుకోలేమని వివరించారు. గ్లకోమాతో బాధపడుతున్న కొందమంది వ్యాధిగ్రస్తులను 12 నెలల పాటు పరీక్షించగా సత్ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు.













