అమెరికాలో 48 లక్షల కొత్త ఉద్యోగాలు
జూన్లో అమెరికా సంస్థలు 48 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాయి. ఫలితంగా నిరుద్యోగ రేటు 11.1 శాతానికి తగ్గింది. అమెరికాలో ఉద్యోగ విపణి మెరుగుపడటం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం. కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో దాదాపు 2.2 కోట్ల ఉద్యోగాలు గల్లంతయ్యాయి. ప్రస్తుతానికి ఇందులో మూడో వంతు ఉద్యోగాల సృష్టి మాత్రమే సాధ్యపడింది. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికీ ఉద్యోగ విపణి కోలుకోలేదు కొన్ని రెస్టారెంట్లు, బార్లు, ఇతర రిటైల్ సంస్థలు తెరుచుకున్నా.. మళ్లీ కేసుల రాక పెరగడంతో మూతపడ్డాయి.













