16 సెకన్లు.. 16 వేల టన్నులు నేలమట్టం
16వేల టన్నుల బరువున్న 21 అంతస్థుల బిల్డింగ్‌ను కేవలం 16 సెకన్లలో నేలమట్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బెత్లేహోం స్టీల్ కంపెనీకి చెందిన ఈ 21 అంతస్థుల మార్టిన్ భవనాన్ని 1972లో ప్రారంభించారు. అయితే గత 12 ఏళ్లుగా ఈ బిల్డింగ్ నిరుపయోగంగా ఉంది. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం బిల్డింగ్‌ను కూల్చివేయాలనుకుంది. అందుకోసం 219 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను వినియోగించింది. ఈ క్రమంలో 16 వేల టన్నుల బరువున్న ఈ భవనాన్ని కేవలం 16 సెకన్లలో నేలమట్టం చేసింది. ఈ సంఘటన గురించి చుట్టుపక్కల ప్రజలు మేం భావించిన దాని కంటే చాలా పెద్ద శబ్దం వినిపించింది. మా కాళ్ల కింద భూమి కదిలిపోతుందేమో అనిపించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఉన్న ప్రదేశంలో కొత్త భవాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.













