కన్యత్వాన్ని ఆన్ లైన్ లో వేలానికి పెట్టిన యువతి
చదువు, భవిష్యత్ కోసం అంటూ ఓ మోడల్ అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. తన కన్యత్వాన్ని వేలం వేసింది. దీంతో అక్షరాల రూ.19.5 కోట్లు ఆమెకు దక్కనున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమెరికాకు చెందిన 19 ఏళ్ల గిసెల్లీ అనే యువతి మోడల్‌గా పనిచేస్తోంది. తన చదువు, భవిష్యత్‌లో ప్రయాణ ఖర్చుల కోసం కన్యత్వాన్ని వేలం వేయాలని నిర్ణయించుకుంది. సంప్రదింపుల అనంతరం జర్మనీకి చెందిన సిండరెల్లా అనే ఓ ఎస్కార్ట్ సర్వీసెస్ వెబ్సైట్ వేదికగా ఈ వేలాన్ని నిర్వహించారు. అబుదాబికి చెందిన ఓ వ్యాపారవేత్త అందరికంటే ఎక్కువగా 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19.5 కోట్లు)కు యువతి కన్యతాన్ని దక్కించుకున్నాడు. అబుబాబికే చెందిన మరో వ్యాపారవేత్త 2.5 మిలియన్ డాలర్లు, హాలీవుడ్‌కు చెందిన ఓ నటుడు 2.4 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు పోటీ పడ్డారు. రష్యాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు 1.8 మిలియన్ డాలర్లు చెల్లించడానికి ముందుకొచ్చాడు.













