తొలి భారతీయ ప్లేయర్‌గా శభాష్ మానస్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)సర్క్యూట్లో జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీగా పరిగణించే ఎడ్డీ హెర్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా మానస్ ధామ్నె చరిత్ర సృష్టించారు. ఫ్లోరిడాలో జరిగిన అండర్-12 బాలుర సింగిల్స్ ఫైనల్లో పుణెకి చెందిన 11 ఏళ్ల మానస్ 3-6, 6-0, 10-6తో సూపర్ టైబ్రేక్‌లో మాక్స్వెల్ ఎక్స్టెడ్ (అమెరికా)పై విజయం సాధించాడు. డబుల్స్ విభాగంలో మానస్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో మానస్(భారత్)- ఆరవ్ హడా (నేపాల్) జంట 6-7 (5/7), 2-6తో సె హ్యుక్ చో-మిన్సెక్ మాయోంగ్ (కొరియా జోడీ చేతిలో ఓడిపోయింది.













