భారత్కు అమెరికా చట్టసభల సభ్యులు విజ్ఞప్తి
క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ కంప్యాషన్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను కొనసాగనివ్వాలని భారత్కు అమెరికా చట్టసభల సభ్యులు విజ్ఞప్తి చేశారు. అమెరికాకు చెందిన కంప్యాషన్ ఇంటర్నేషనల్ మత మార్పిడి కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపణలు రావడంతో, గతేడాది మే నెలలో కేంద్రం ఈ సంస్థను ముందస్తు అనుమతి విభాగంలో చేర్చింది. ఈ విభాగంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధులు పొందాలంటే ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలను తొలగించాలని అమెరికా వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చినప్పటికీ కేంద్ర నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆంక్షలు తాత్కాలికంగానైనా ఎత్తివేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఎడ్ రాయిస్, ఇలియట్ ఎంగెల్లు 107 మంది సహచర సభ్యులతో సంతకాలు చేయించిన లేఖను కేంద్ర హోంశాఖకు పంపించారు.













