Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema Reviews » Rgv s naked nanga nagnam move review

యూత్ ని ఆకట్టుకోడానికి ఛీఫ్ ట్రిక్స్ ప్లే చేసిన RGV ‘నేకేడ్ నంగే నగ్నం’

  • Published By: techteam
  • June 28, 2020 / 12:39 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Rgv S Naked Nanga Nagnam Move Review

ఉచితంగా అయినా చూడకండి

Telugu Times Custom Ads

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 1/5

వేదిక : శ్రేయాస్ ఈటి అప్ లోని, ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ప్రసారం

తారాగణం: శ్రీ రాపాక, దీపక్ తదితరులు నిర్మాణం, రచన, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

విడుదల : జూన్ 27 రాత్రి 9 గ.లకు

టాలీవుడ్‌లో సంచలనాలకు మారుపేరైన రాంగోపాల్ వర్మ లాక్‌డౌన్‌లో ఛీఫ్ ట్రిక్స్ తో తన సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కంటే ఎక్కువగా విస్తృతంగా ప్రేక్షకులను తన సినిమాలతో వెంటాడుతున్న ఆర్జీవి తాజాగా అంటే జూన్ 27 తేదీ రాత్రి 9 గంటలకు తన కొత్త చిత్రం నగ్నం (NNN) చిత్రాన్ని రిలీజ్ చేశారు. శ్రేయాస్ ఈటి అప్ లోని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోండి…

కథ విషయానికొస్తే ఇందులో కథ లేదు అంతా అవయవ ప్రదర్శనే అలాంటి సంపద వున్న శ్రీ రాపాక (స్వీటి) ఇంట్లోని పనివాడి (జమల్) అక్రమ సంబంధం పెట్టుకొంటుంది. భార్య అక్రమ సంబంధం విషయం భర్త దీపక్‌కు దృష్టికి వస్తుంది. శ్రీ చేసిన పనికి ఆగ్రహం కలిగిన దీపక్‌ భార్య‌పై దాడి చేస్తాడు. ఈ క్రమంలో జమాల్‌తో జరిగిన గొడవలో కొట్టిన సింగిల్ షాట్ కే దీపక్ మరణించడం జరుగుతుంది. దీపక్ మరణించిన తర్వాత భార్య శ్రీ రాపాక చేసింది? అక్రమ సంబంధం వ్యవహారంలో హత్యలో కూరుకుపోయిన జమాల్ పరిస్థితి ఏమిటి? మర్డర్ తర్వాత ఏం జరిగాయి అనే ప్రశ్నలు సాధారణంగా తలెత్తడం సహజం. ఇలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా నగ్నం (నేకెడ్) ముగియడం ఈ కథలో విషాదంగా చెప్పుకోవచ్చు.

నగ్నం లాంటి కథలో నటించడానికి, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉంటుందనే ఆశించడమే పెద్ద తప్పు అవుతుంది. శ్రీ రాపాక పాత్రలో కనిపించిన స్వీటీకి అందాల ఆరబోతకు పరిమితమైంది. ఆమెకు నటించాలనిపించాలనే కోరిక మనసులో ఉన్న అందుకు కథలో, సన్నివేశాల్లో స్కోప్ లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. ట్రైలర్‌లో మించి ఈ సినిమాలో ఎక్కువ హాట్ సన్నివేశాలను ఆశిస్తే అది పెద్ద తప్పు చేసినట్టే అవుతుంది. ఇక మిగిలిన రెండు పాత్రలకు కూడా స్కోప్ లేదనే చెప్పాలి.

ఇక కథ, కథనాల విషయానికి వస్తే.. నగ్నం చిత్రంలోని కథలో ఎలాంటి ట్విస్టులు, టర్న్‌లకు తావు ఇవ్వకుండా ఓ పిచ్చి సినిమా అనే భ్రమను కలిగించేలా ఉంటుంది. బూతు తప్ప కథలో ఎలాంటి జోష్ కనిపించదు. కథేంటి అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. హాట్ సీన్లు తప్ప కథ గురించి మాట్లాడుకోవడానికి స్కోప్ కనిపించదు. ఈ సినిమా గురించి ఏ విషయం గురించైనా ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిందనే ఫీలింగ్ కలుగుతుంది.

రాంగోపాల్ వర్మలోని క్రియేటివిటీ ఏమాత్రం నగ్నం చిత్రంలో కనిపించదు. ఈ సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్ చూస్తే అర్ధం అయిపోయింది కాబట్టి ఆర్జీవి నుంచి ఇంకా ఏదైనా ఆశిస్తే అది బ్లండర్ అవుతుంది. బూతు, కెమెరా యాంగిల్స్‌పై పెట్టిన ఇంట్రెస్ట్.. కథపై ఏమాత్రం పెట్టినట్టు కనిపించదు. ఏది తోచితే అది తీశారా అనే ఫీలింగ్ కలుగుతుంది. వర్మ గురించి ఇక ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వేస్టే. వర్మ దిగజారుడు తనానికి పరాకాష్ట అనే విషయాన్ని గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి. దానికి నగ్నం చిత్రం బలం చేకూర్చింది.

ఇలాంటి కథను ఎలివేట్ చేయడానికి సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్ లాంటి విభాగాలకు పెద్దగా పనేమి ఉండదు. అది ఈ సినిమాలో స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. కెమెరాతో తీసినట్టు చెప్పుకొన్న వర్మ.. బూతును తెరపై యాంగిల్స్‌ను ఆవిష్కరించడానికి చాలానే కష్టపడ్డారనిపిస్తుంది. మ్యూజిక్, ఇతర సాంకేతిక అంశాలు కనీస ప్రమాణాలకు దూరంగా ఉన్నాయి.

సినిమా మేకింగ్‌లో అపారమైన మెలుకువలు, నాలెడ్జ్ ఉన్న వర్మ నుంచి ఇలాంటి చవకబారు సినిమా వచ్చిందంటే జీర్ణించుకోవడం చాలా కష్టమైన పని. డబ్బు సంపాదన కోసం ఓ దర్శకుడు ఇలాంటి నీచమైన సినిమాలు తీసిన సంఘటనలు టాలీవుడ్‌లో ఇదే తొలిసారి కావొచ్చు. వర్మ అంటే ఓ బ్రాండ్ అనేది గతంలో ఉన్న ఇమేజ్. వర్మ అంటే పాకెట్‌కు బ్యాండ్ అనేది ఇప్పటి ఫీలింగ్. ఇలాంటి సినిమాకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. కుళ్లిపోయిన కాలం నాటి బూతుమయంతో డబ్బులు చేసుకోవాలనే ఒకే ఒక్క ఆలోచనతో మోతాదుకు మించిన గ్లామర్ షోను కురింపించేసి వర్మ అందించిన ఈ చెత్త సినిమాని దయచేసి ఎవ్వరు చూడకండి. పైరసీలో దొరికినా గానీ చూడకుండా ఉండటం ఇంకా మంచిది. కనీసం బ్యాండ్‌విడ్త్, ఇంటర్నెట్ డేటా, మన విలువైన సమయం, ఇతర ఎనర్జీలు వేస్ట్ కాకుండా ఉంటాయి.

 

Tags
  • Naked Nanga Nagnam
  • Review
  • RGV

Related News

  • Ghaati Movie Review

    Ghaati Movie Review: మరో స్మగుల్డ్ కథ ‘ఘాటి’

  • War 2 Movie Review

    WAR 2 Review: యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ ‘వార్ 2’

  • Coolie Movie Review

    Coolie Review: డీలా పడిన ‘కూలీ’

  • Mayasabha Web Series Review

    Mayasabha: రివ్యూ ‘మయసభ’ వెబ్ సిరీస్ లో

  • Kingdom Movie Review

    Kingdom Movie Review: విజయ్ స్టార్ డమ్ ను పెంచిన ‘కింగ్‌డమ్’

  • Hari Hara Veera Mallu Part 1 Movie Review

    HHVM P-1 Review: ‘హరి హర వీర మల్లు’ పార్ట్ 1 సరే! పార్ట్ 2 ఉంటుందా?

Latest News
  • Ravi Teja: “లిటిల్ హార్ట్స్” సినిమాకు సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ
  • K-Ramp: “K-ర్యాంప్” దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్
  • Kishkindhapuri: కిష్కింధ‌పురిలో రామాయ‌ణం రిఫ‌రెన్స్
  • Sambharala Yeti Gattu: సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు (SYG) యాక్షన్ సీక్వెన్స్
  • TG Viswa Prasad: ‘మిరాయ్‌’ ఎక్స్‌ట్రార్డినరీ ఫాంటసీ విజువల్ వండర్ – నిర్మాత టిజి విశ్వప్రసాద్
  • Telusu Kadaa?: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ టీజర్ సెప్టెంబర్ 11న విడుదల
  • Bellamkonda Sai Sreenivas: ఆ వైబ్రేష‌న్స్ చాలా సార్లు ఫేస్ చేశా
  • Ustaad Bhagath Singh: దేవీ పాట‌కు 400 మందితో ప‌వ‌న్ మాస్ స్టెప్పులు
  • Bellamkonda Ganesh: కరుణాక‌ర‌న్ తో బెల్లంకొండ గణేష్ మూవీ?
  • Sudhan Gurung: జెన్ జీ ఉద్యమంతో ఊగిపోతున్న నేపాల్.. ఉద్యమసారథి సుదన్ గురుంగ్ ప్రస్థానం…?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer