Game Changer: ఎన్టీఆర్ వల్ల కానిది చరణ్ వల్ల అవుతుందా?
ఆర్ఆర్ఆర్(RRR) లాంటి భారీ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఆ హీరో నుంచి తర్వాత వస్తున్న సినిమా జాతీయ స్థాయిలో ఏ రేంజ్ లో ఆడుతుందో అనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. అయితే బాహుబలి(Baahubali) తర్వాత ప్రభాస్(Prabhas) మార్కెట్ పెరిగినట్టు మిగిలిన హీరోల మార్కెట్ పెరుగుతుందా లేదా అన్నది డౌట్ గానే కనిపిస్తుంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్(NTR) నటించిన దేవర(Devara) సినిమా పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మరి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లోని మరో హీరో చరణ్(Ram Charan) నుంచి వస్తున్న గేమ్ ఛేంజర్(Game Changer) ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. చరణ్(Charan), తన ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అయితే గేమ్ ఛేంజర్ అనుకున్న దానికంటే బాగా లేటవడం, మధ్యలో శంకర్ నుంచి వచ్చిన ఇండియన్2(Indian2) డిజాస్టర్ అవడంతో గేమ్ ఛేంజర్ పై అనుకున్నంత హైప్ లేదు. పరిస్థితులు చూస్తుంటే గేమ్ ఛేంజర్(Game Changer) పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవడం అంత తేలిక కాదనిపిస్తుంది. గేమ్ ఛేంజర్ కు పెద్దగా బజ్ కూడా లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటూ కన్నడ, తమిళ భాషల్లో తప్ప ఈ సినిమా మిగిలిన భాషల్లో తక్కువ బజ్ తోనే రిలీజవుతుంది. యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి ఆడియన్స్ కనెక్ట్ అయితే తప్ప గేమ్ ఛేంజర్ వండర్స్ చేయడం కష్టం. మరి కొన్ని గంటల్లో గేమ్ ఛేంజర్ ఫలితం వచ్చేస్తుంది.













