రిలీజ్ కు ముందు రాజమౌళి అసలు ప్లాన్ ఇదేనా?
మహేష్ బాబు(mahesh babu)- ఎస్ఎస్ రాజమౌళి(ss rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి (varanasi) ఇప్పుడు షూటింగ్ దశ నుంచి రిలీజ్ ప్లానింగ్ దశలోకి అడుగుపెడుతోంది. రెండేళ్లకు పైగా సాగిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఏప్రిల్ 7న రిలీజ్ డేట్ లాక్ కావడంతో, ఇకపై ప్రతి పని టైమ్‌లైన్ ప్రకారమే జరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మహేష్ బాబు తన పాత్రకు సంబంధించిన కీలక సీన్స్ ను పూర్తి చేయడంతో పాటు డబ్బింగ్ కూడా మొదలుపెట్టడం ఈ సినిమా నిర్మాణంలో కీలకమైన ముందడుగుగా మారింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక వారం షూట్ మాత్రమే మిగిలి ఉండగా, అది స్పెషల్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కావడం ఆసక్తిని పెంచుతోంది.
ఇక ప్రియాంక చోప్రా(priyanka chopra) కూడా తన మెయిన్ షూటింగ్‌ను పూర్తి చేయగా, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithvi raj sukumaran)కు సంబంధించిన కీలక సీన్స్ ను ఇప్పటికే షూట్ చేశారు. దీంతో ప్రధాన నటీనటుల షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసిన రాజమౌళి దృష్టి ఇప్పుడు పెండింగ్ వర్క్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్పైకి మళ్లినట్లు తెలుస్తోంది. భారీ విజువల్స్, యాక్షన్, మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న సినిమా కావడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ టైమ్ కేటాయించాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు సమాచారం.
వారణాసిని కేవలం తెలుగు సినిమా పరిధిలో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లాలన్నది రాజమౌళి ప్లాన్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లీష్ వెర్షన్ కోసం ఓ ఇంటర్నేషనల్ స్టూడియోతో కలిసి పనిచేసే అంశంపై డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తయ్యేలోపే పోస్ట్ ప్రొడక్షన్‌ను ముందుకు తీసుకెళ్లడం, ఆ తర్వాత గ్లోబల్ ప్రమోషన్స్‌కు వెళ్లడం ద్వారా లాస్ట్ మినిట్ లో ప్రెజర్ లేకుండా రిలీజ్‌కు రెడీ కావాలన్నది మేకర్స్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. కేఎల్ నారాయణ (KL Narayana)నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి(keeravani) సంగీతం అందిస్తున్నారు.








