ఫౌజీ రిలీజ్ పై కొత్త ప్లాన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నుంచి రాబోతున్న ఫౌజీ(Fauzi) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా పరిస్థితులు ఇప్పుడు రిలీజ్ ప్లాన్‌పై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా డిసెంబర్ 3న ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావించినా, ప్రస్తుత షూటింగ్ ప్రోగ్రెస్‌ను పరిశీలిస్తే ఆ డేట్‌కు సినిమా రెడీ చేయడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న రెండు యాక్షన్ బ్లాక్స్‌తో పాటు కొంత ప్యాచ్ వర్క్ ఇంకా పూర్తికావాల్సి ఉన్నట్లు సమాచారం. దీంతో తొందరపడి వర్క్స్ ముగించి డిసెంబర్లో రిలీజ్ చేయడం కంటే సినిమాకు అవసరమైన టైమ్ ఇవ్వాలని టీమ్ డిసైడ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
ఫౌజీ కోసం మరో 50 నుంచి 60 రోజుల షూటింగ్ అవసరమవుతుందని తెలుస్తుండటంతో, దానికి తగ్గట్టుగానే పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ లెక్కన డిసెంబర్ 3 రేసు నుంచి సినిమా తప్పుకోవడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం టీమ్ ముందున్న మెయిన్ డిస్కషన్ కొత్త రిలీజ్ డేట్‌పైనే. అందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 26ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఈ విండోతో లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
అయితే జనవరి 26 తేదీపై కూడా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. సమ్మర్లో ప్రభాస్(prabhas) స్పిరిట్(spirit) రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో రెండు సినిమాల మధ్య తగిన గ్యాప్ ఉండేలా రిలీజ్ క్యాలెండర్‌ను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగానే ఫౌజీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) తొందరపడటం లేదని తెలుస్తోంది. ఒకసారి డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్లీ మార్పు లేకుండా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అన్నీ పక్కా ప్లాన్‌తో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.








