మెల్బోర్న్లో ప్రమాదం.. ఇద్దరు విశాఖ వాసులు మృతి
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam)కు చెందిన ఇద్దరు మృతి చెందారు విశాఖకి చెందిన జిటి ప్రసాద్ (GT Prasad) తన భార్యతో కలిసి శుభకార్యంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్బోర్న్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ భార్య(Wife), కోడలు(Daughter in law) మృతి చెందగా.. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే కారు ప్రమాదంలో భార్య, కోడలు మృతి చెందడంటో ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన గతంలో విడిసిఎలో జాయింట్ సెక్రటరీ (Joint Secretary)గా పని చేశారు. దాదాపు పది రోజుల తర్వాత మృతదేహాలు విశాఖకు చేరుకునే అవకాశముందని సమాచారం.








