ఒక్క ఎకరాలేని కేసీఆర్‌కు..రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి ?: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ (Karimnagar) లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ (KCR) పేర్కొన్నారు. సున్నా ఎకరాల నుంచి రూ.వేల కోట్ల విలువైన ఆస్తులకు ఆయన ఎలా ఎదిగారు? అంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ భూములు భారీగా పెరిగిన విషయం ఎన్నికల అఫిడవిట్‌తో స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు అప్పలే మిగిలాయి. పుట్టుకతోనే కేసీఆర్‌కు వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ (KTR) దబాయిస్తున్నారు. అయితే, నాటి ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ తప్పులు రాసి మోసం చేశారా? లేక జ్రలకు మీరు అబద్ధాలు చెబుతున్నారా? అని ప్రశ్నించారు.








