బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ (Manne Krishank) ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ గేట్ (Assembly gate) వద్ద జరిగిన ఘటనపై ఎక్స్ లో వివాదాస్పద పోస్ట్ చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో క్రిశాంక్‌ను అరెస్ట్ చేసిన సీసీఎస్ (CCS)కు తరలించారు.ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకే క్రిశాంక్ నివాసం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి
క్రిశాంక్ ఇంటి తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించేందుకు పోలీసులు (police) ప్రయత్నించారు. పోలీసుల రాకతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం క్రిశాంక్ నివాసానికి చేరుకుంది. పార్టీ కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటుండటంతో పరిస్థితి రాజకీయంగా వేడెక్కింది. తాజాగా మరో కేసు నమోదు చేయడం ద్వారా ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ ( BRS) ఆరోపిస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేస్తూ పార్టీ నేతలను పదేపదే పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని విమర్శిస్తోంది.








