నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-race case)లో విచారణకు ఆయన వచ్చారు. కేటీఆర్‌తో పాటు ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (Arvind Kumar), హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy), స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా హాజరయ్యారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
ఫార్ములా ఈ- రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ (HMDA) నుంచి సుమారు రూ.55 కోట్ల బదిలీపై ఏసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అవసరమైన అనుమతులు, ఆర్థిక విధివిధానాలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిందితులకు సమన్లు జారీ చేసింది. గత విచారణకు కేటీఆర్ వ్యక్తిగత కారణాలతో గైర్హాజరయ్యారు. విచారణ నేటికి వాయిదా పడటంతో హాజరయ్యారు.








