రామ్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni) ప్రస్తుతం హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా తన కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యాక్షన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, సినిమాకు సంబంధించిన ఒక్కో కీలక అంశం బయటకు వస్తూ ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా రామ్‌ను ఢీకొట్టే విలన్ క్యారెక్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఈ కీలక పాత్ర కోసం తొలుత కోలీవుడ్ నటుడు ఎస్.జే. సూర్య(SJ Surya)ను సంప్రదించినట్టు సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదని తెలుస్తోంది. దీంతో చిత్రబృందం బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్(Ritesh Deshmukh) వైపు వెళ్లినట్టు సమాచారం. చివరకు రితేష్‌ను విలన్ పాత్రకు ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. రామ్‌తో ఇప్పటివరకు కనిపించని తరహా ఫైట్‌ను ఈ సినిమాలో రితేష్ క్యారెక్టర్ ద్వారా చూపించనున్నారనే ఆసక్తి నెలకొంది.
ఈ కాస్టింగ్‌లో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. గతంలో రామ్‌తో కలిసి హీరోయిన్గా నటించిన జెనీలియా(Genelia) ఇప్పుడు రితేష్ దేశ్‌ముఖ్ భార్య కావడంతో, ఆమెతో కలిసి పనిచేసిన రామ్‌కు ఈసారి ఆమె భర్త ప్రత్యర్థిగా కనిపించనుండటం స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. రామ్ అన్నయ్య కృష్ణ పోతినేని(Krishna Pothineni) నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో పనులు కొనసాగుతున్నట్టు సమాచారం.








