ప్రభాస్ మీద పై చేయి సాధించడమా? కష్టమే!
బాహుబలి సినిమాతో శిఖర స్థాయికి చేరిన ప్రభాస్ ఇమేజ్ ను తర్వాత ఆయన చేసిన ఏ సినిమా మ్యాచ్ చేయలేదు. సాహో సినిమాకు మంచి ఓపెన్సింగ్ వచ్చాయి. వీకెండ్ వరకు బాగా పెర్ఫార్మ్ చేసింది కానీ వీకెండ్ తర్వాత డల్ అయి, డిజాస్టర్ గా మిగిలింది. తర్వాత వచ్చిన రాధేశ్యామ్ మూవీ అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది.
ఆదిపురుష్ కూడా సాహో లానే వీకెండ్ వరకు ఊపు చూపించి తర్వాత సైలెంట్ అయింది. ఈ మూడింట్లో ఏ సినిమా కూడా ప్రభాస్ రేంజ్ కు సరిపోయే మూవీ కాదు. అంతమాత్రాన ప్రభాస్ క్రేజ్ ఏమీ తగ్గినట్లు కాదు. మార్కెట్ పరంగా కూడా ప్రభాస్ సినిమాలకు బిజినెస్ భారీగానే జరుగుతుంది. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల బడ్జెట్స్, వాటి బిజినెస్ ఆఫర్లే దీనికి కారణం.
ఆ సినిమాలకు మంచి బజ్, క్రేజ్ ఇప్పటికే వచ్చేశాయి. ఇక అసలు విషయానికొస్తే రాధేశ్యామ్ రిలీజైన టైమ్ లో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ భారీ విజయాన్నందుకున్న సంగతి తెలిసిందే. దీంతో వివేక్ అగ్నిహోత్రి మరోసారి తన సినిమాను ప్రభాస్ కు పోటీగా రిలీజ్ చేసి, తన మీద పైచేయి సాధిస్తానని ఇంతకుముందే గొప్పలు పోయాడు. చెప్పినట్లే సలార్ కు పోటీగా తన తాజా సినిమా వ్యాక్సిన్ వార్ ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.
అయితే వివేక్ అగ్నిహోత్రి అనుకున్నట్లు ఈ సినిమా కశ్మీర్ ఫైల్స్ గా మ్యాజిక్ చేయడం కష్టమే అనేది క్రిటిక్స్ అంటున్న మాట. సలార్ కు ఉన్న హైప్ తో కంపేర్ చేసుకుంటే అసలు వ్యాక్సిన్ వార్ కు ఆ రోజు పెద్ద సంఖ్యలో థియేటర్లు దక్కడం కూడా కష్టమే. అలాంటిది ప్రభాస్ మీద పైచేయి సాధించడమనేది అసాధ్యమనే చెప్పాలి. అసలే ఈసారి ప్రభాస్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కచ్ఛితంగా హిట్ కొట్టాల్సిందే అనే రీతిలో ఈ సినిమాను ప్రభాస్, నీల్ ప్లాన్ చేశారు. మరి అలాంటి టైమ్ లో వ్యాక్సిన్ వార్ ను రిలీజ్ చేసి వివేక్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో చూడాలి.













