ధమ్కీలో హైలెట్స్ అవే!
టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించే విశ్వక్ సేన్‌కు మిగిలిన హీరోలతో పోలిస్తే, తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఎప్పుడో వివాదాలతో మునిగి తేలే విశ్వక్ డైరెక్టర్‌గా చేస్తున్న రెండో సినిమా దాస్ కా ధమ్కీ. ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ను చీఫ్ గెస్టుగా పిలిచి శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేశారు. దీంతో ఒక్కసారిగా ధమ్కీ మీద అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా ఇప్పటికే పూర్తి అయింది.
ఇప్పుడు ఈ సినిమాలోని ప్లస్ పాయింట్ ఏంటి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ సినిమాలో విశ్వక్ పెర్ఫామెన్స్ అల్టిమేట్‌గా ఉండనుందట. సినిమా మొత్తానికి ఇదే అడిషనల్ ఎట్రాక్షన్ అంటున్నారు. ఇందులో ఉండే యాక్షన్ సీన్వెన్స్ గురించి సినిమా రిలీజ్ అయ్యాక చెప్పుకుంటారట. యాక్షన్ సీక్వెన్స్ విషయంలో డైరెక్టర్ విశ్వక్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది.
అన్నీ బాగానే ఉన్నా ధమ్కీలో కామెడీ మాత్రం సో సో గానే ఉంటుందని, సినిమా మొత్తం మీద రెండు సాంగ్స్ చాలా బావున్నాయని టాక్. ఈ సినిమాను విశ్వక్ సేన్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. విశ్వక్ సేన్ ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుంటూ ధమ్కీపైన బాగానే హైప్ పెంచాడు. మరి సినిమా విశ్వక్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













