రాములమ్మకు మెగా ఛాన్స్!
మహేష్‌బాబు చిత్రంతో ఇప్పటికీ సరిలేరు నాకెవ్వరూ అనిపించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విజయశాంతి తన రెండో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవితో సంచలన దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న చిత్రంలో ఓ ముఖ్యపాత్ర కోసం విజయశాంతి పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. చిరంజీవి- విజయశాంతి కాంబినేషన్‌కు అప్పట్లో యమ క్రేజ్ ఉండేది. వీరిద్దరూ నటించిన పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్, యుముడికి మొగుడు, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు వంటి పలు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి చిత్రంలో విజయశాంతి నటించడం కచ్చితంగా ఆ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుంది.













