‘విక్టోరియా’ చిత్రం మొదలైంది
మోహన్ ప్రొడక్షన్స్ సమర్పణలో చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీలు ప్రధాన పాత్రధారులుగా నవీన్ లొట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం విక్టోరియా దీనికి టాట్ లైన్ మహారాణి. ఓ ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగిన అనుకోని సంఘటనలు, వారి జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకువచ్చాయి అనేది ఈ సినిమా. అలానే అమ్మాయిలను రేప్ చేసి చంపేయడం, ప్రజలు దాని గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చించడం కామన్ టాపిక్ అయిపోయింది. ఈ తరహా తీరును ఈ సినిమాలో ప్రస్తావిస్తూ తెరకెక్కించిన చిత్రమే విక్టోరియా. ఈ కార్యక్రమంలో నిర్మాత అర్జున్ అప్పారావు, మురళి వై కృష్ణ, చిత్రాన్ని ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీ ఇతరులు పాల్గొన్నారు.













