కత్రినా కైఫ్‌కు కొత్త బోయ్ ఫ్రెండ్
యురి ది సర్జికల్ స్ట్రయిక్‌తో రెండొందల కోట్ల క్లబ్బులో చేరిపోయిన విక్కీ కౌశల్ గత కొంతకాలంగా కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలొస్తున్నాయి. కత్రినా కైఫ్ సరికొత్త బోయ్ ఫ్రెండ్‌గా విక్కీ కౌశల్ పేరు జోరుగా వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవం లేదని విక్కీ కొట్టి పారేస్తున్నాడు. రణబీర్‌తో పెళ్లి వరకు వచ్చి.. వ్యవహారం చెడ్డాక మళ్లీ సల్మాన్ పంచన సేద దీరుతున్న కత్రినా మాత్రం ఈ విషయమై పెదవి విప్పడం లేదు.ఒక వైపు సక్సెస్‌లు లేక, మరోవైపు బోయ్ ఫ్రెండ్ కూడా లేకపోతే పరువు పూర్తిగా పోతుందని విక్కీని ప్రేమలో దింపి ఉండొచ్చనే అనుమానాలు బాలీవుడ్లో వ్యక్తమవుతున్నాయి.













