వెంకీ స్పీడ్ కు షాక్ అవతున్న ఇండస్ట్రీ
మలయాళ సూపర్ హిట్ దృశ్యం ను విక్టరీ వెంకటేష్ అదే పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు దాని సీక్వెల్ దృశ్యం2 ను వెంకీ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. దృశ్యం2 ఓటీటీ లో రిలీజ్ అయింది కాబట్టి దాన్ని ఎక్కువ మంది తెలుగు ఆడియన్స్ చూసే అవకాశాలు చాలా ఎక్కువ. దానికి తోడు సబ్ టైటిల్స్ కూడా పెట్టుకుని చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. కాబట్టి దృశ్యం2 ను తెలుగులో లేట్ చేస్తే ఆ ఒరిజినల్ ఫీల్ పోయే ఛాన్స్ ఉందని, అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనతో షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు.
ఇప్పటికే దృశ్యం2 సీక్వెల్ పనులు కూడా మొదలయ్యాయ. అది ఎంత త్వరగా అంటే ఎఫ్3 షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి మరీ దృశ్యం2 షూటింగ్ లో పాల్గొంటున్నారట. పెద్దగా ఛేంజెస్ కూడా లేకుండా దృశ్యం2 చేసిన చోటే ఇది కూడా యదా తథంగా చేయాలని చూస్తున్నారట. కేవలం రెండు నెలల్లోనే ఇది పూర్తి చేసి లేట్ చేయకుండా మే లేదా జూన్ లోపు రిలీజ్ కూడా చేయాలని చూస్తున్నారట మేకర్స్. అందరూ దృశ్యం2 మేకింగ్ చూసి చాలా ఆశ్చర్యపోతున్నారట. ఇదిలా ఉంటే వెంకీ నటిస్తున్న ఎఫ్3 సినిమా ఆగస్టు లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.













