ఈ నెల 27 న ‘వరుడు కావలెను’ మరియు స రి గ మ ప లో ‘వలిమై’ టీం తో మన ముందుకు వస్తున్న జీ తెలుగు
– సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ‘వరుడు కావలెను’ ప్రసారం కాగా, బోనీ కపూర్, యువన్ శంకర్ రాజా మరియు కార్తికేయ రాత్రి 9 గంటలకు స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ లో ప్రత్యేక అతిథులుగా విచ్చేయనున్నారు –
తగ్గేదేలే అంటూ అభిమానులను కొత్త షోస్ తో అలరిస్తున్న మన జీ తెలుగు, ఈ ఆదివారం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడానికి ‘వరుడు కావలెను’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ ‘ మొదటి ఎపిసోడ్ తో అందరిని అలరించడానికి వస్తుంది
ఆకాశ్(నాగశౌర్య) ఆర్కిటెక్. విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటాడు. ఓ ప్రాజెక్ట్ చేయడానికి డీల్ కుదుర్చుకుని, అందులో భాగంగా హైదరాబాద్ చేరుకుంటాడు. భూమి(రీతూ వర్మ) ఓ స్టార్టప్ కంపెనీ పెట్టి ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ను సరఫరా చేస్తుంటుంది. తను అన్నింట్లో పర్ఫెక్ట్నెస్ కోరుకొనే అమ్మాయి. మరోవైపు భూమి తల్లి (నదియా) ఆమెకు పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలను చూస్తుంటుంది. హైదరాబాద్‌లో భూమిని చూసి ఆకాశ్ ప్రేమలో పడతాడు. ఒక వైపు భూమి మరియు ఆకాష్ కు ప్రేమ – పెళ్లి మీద ఒక అభిప్రాయం ఉంటే వారి తల్లదండ్రులకు వేరే అభిప్రాయం ఉంటది. ఇంత భిన్నగా ఉండే వీరి అభిప్రాయాలు కలుస్తాయా? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ సినిమాని ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు చూడాల్సిందే.
వినోదం అప్పుడే ఐపోలేదు, రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ మొదటి ఎపిసోడ్ – ‘మెంటర్స్ ఛాలెంజ్ రౌండ్’. ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ పాటలతో మన ముందుకు వస్తున్నారు ‘వలిమై’ సినిమా టీం – ప్రొడ్యూసర్ బోనీ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా మరియు యాక్టర్ కార్తికేయ. స్పెషల్ గెస్ట్స్ గా విచ్చేసి కంటెస్టెంట్స్ తో కలిసి ఆట పాటలలో మునిగి తేలనున్నారు.
ఇంకా ఎందుకు ఆలస్యం ఈ ఆదివారం ‘వరుడు కావలెను’ సాయంత్రం 6 గంటలకు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగు లో తప్పక చూడండి.













