రాధేశ్యామ్ డైరెక్ట్తో మరోసారి యువి సినిమా?
గోపీచంద్ తో జిల్ సినిమా చేసిన రాధాకృష్ణకు ఆ సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. జిల్ లో గోపీచంద్ ను సూపర్ స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తూ యాక్షన్ పండించిన తీరుకు ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేసే అవకాశం దక్కింది. జిల్ లో రాధా కృష్ణ టాలెంట్ చూసిన యూవీ నిర్మాతలు రాధేశ్యామ్ కు అవకాశమిచ్చారు.
కానీ ఆ ఛాన్స్ ను రాధాకృష్ణ సరిగా వాడుకోలేకపోయాడు. అవసరం లేని భారీ హంగులతో సినిమాకు చాలా పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టించి, ప్రభాస్ ఇమేజ్ కు తగని కథతో సినిమా చేసి ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు. ఫలితంగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. యువీ నిర్మాతలు ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయారు.
ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి వారికి చాలానే టైమ్ పట్టింది. తమకు ఫ్లాప్ ను ఇచ్చినప్పటికీ రాధాకృష్ణతో మరో సినిమా చేయడానికి యువీ నిర్మాతలు ముందుకొచ్చినట్లు సమాచారం. కాకపోతే ఈసారి రాధేశ్యామ్ లా భారీ బడ్జెట్ సినిమా కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్తో సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడా రాధాకృష్ణ పూర్తి చేసినట్లు సమాచారం. మరి ఈసారైనా యువి నిర్మాతల నమ్మకాన్ని అతను నిలబెట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి.













