రేపు ఉగాది సినిమా పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి ఏర్పడిన తరువాత తొలిసారిగా నవ్యాంధ్ర రాజధానిలో ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు గుంటూరు జిల్లా ఆత్మకూరులోని హ్యాపీరిసార్ట్లో ఉగాది సినిమా పురస్కారాల వేడుకలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండలి అధ్యక్షుడు రాజా వాసిరెడ్డి భూపాల్ప్రసాద్, కోశాధికారి పాలెపు రామారావు, కార్వనిర్వాహక సభ్యుడు పాకలపాటి విజయవర్మ, నిర్వాహక కమిటీ చైర్మన్ అంబటి మధుమోహనకృష్ణలు మాట్లాడారు. 2012-16కు సంబంధించి ఓనమలు, మిణుగురులు, మిధునం, నా బంగారుతల్లి, ఊపిరి, కంచె, గుండెల్లో గోదారి, రఘపతి వెంకయ్యనాయుడు, ఓమల్లి, థర్డ్మాన్, 2016-17కు సంబంధించి గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి, ఆఆ, మనమంతా, పెళ్లిచూపులు, ఘాజీ, ఎక్కడికిపోతావు చిన్నవాడా, సప్తగిరిఎక్స్ప్రెస్, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. దాన వీరశూరవీరకర్ణకు స్పెషల్జ్యూరీ అవార్డును అందించనున్నట్లు తెలిపారు. మంత్రులు, ఏంపీలు, ఎమ్మెల్యేల వేడుకల్లో పాల్గొననున్నారని చెప్పారు.













