2021-22 ఫ్యాన్స్ కి పండగే..
టాలీవుడ్ లోని స్టార్ హీరోలంతా బ్యాక్ టూ బ్యాక్ భారీ సినిమా లకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రతీదీ ప్లాన్ చేసుకుని ఉన్నారు. పవన్ , ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ ఇలా అందరూ సెట్స్ పై ఒక సినిమా ఉండగానే తర్వాతి రెండు మూడు సినిమాలకు సైన్ చేసి డేట్స్ ఇచ్చేశారు. అంతేకాదు ఐదారు నెలల గ్యాప్ తోనే ఫ్యాన్స్ కు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
ప్రభాస్ నటించిన రెండు సినిమాలు నాలుగు నెలల్లోపు రిలీజవుతుంటే.. బన్నీ కూడా దాదాపు ఇంతే ఆలోచిస్తున్నాడు. ఇక చరణ్ నటిస్తున్న ఆచార్యకు, ఆర్ఆర్ఆర్ కు పెద్దగా గ్యాప్ లేదు. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ లో రిలీజ్ అవుతుంటే, ఆచార్య ఈ మే లో రిలీజవనుంది. కేవలం నాలుగైదు నెలల గ్యాప్ తోనే రెండు సినిమాలతో ట్రీట్ ఇవ్వనున్నాడు చరణ్.
ఇక ఎన్టీఆర్ చాలా తక్కువ గ్యాప్ లోనే బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తారక్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర దాటింది. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ లో రిలీజవనుండగా, తర్వాత త్రివిక్రమ్ తో చేసే సినిమా 2022 ఫస్టాఫ్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 2022 లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల సినిమా రిలీజ్ చేయాలనే అంచనాతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఆరు నెలల్లోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడన్న మాట.
అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఇవన్నీ జరగడం పెద్ద కష్టమేమీ కాదు. తమ ఫేవరెట్ హీరోల సినిమాలు థియేటర్లలో లేక అల్లాడిపోతున్న ఫ్యాన్స్ కు ముందు ముందు డబుల్ ధమాకా ఫెస్టివల్ రెడీ గా ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు.













