Dubai Sangeeth: దుబాయ్ సంగీత్‌కు వెళ్లిన వారికి కాస్ట్ లీ రిటర్న్ గిఫ్టులు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ దగ్గర నుంచి టాలీవుడ్ తారలంతా దుబాయ్ లోనే ఉన్నారు. నిర్మాత మహేష్ రెడ్డి(Mahesh Reddy) కొడుకు పెళ్లి కోసమని వారంతా దుబాయ్ కు వెళ్లగా, దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరంతా వెళ్లింది దుబాయ్ లో పెళ్లికి కాదట. సంగీత్ కోసమట.
అయితే దుబాయ్ లోని ఆ సంగీత్‌కు అటెండ్ అయిన వారందరికీ సదరు నిర్మాత ఎంతో విలువైన రిటర్న్ గిఫ్టులు ఇచ్చారని తెలుస్తోంది. లేడీస్‌కు డైమండ్ జ్యుయలరీ గిఫ్లుగా ఇవ్వగా, జెంట్స్ కు రూ.25 లక్షల కంటే విలువైన కాస్ట్లీ వాచ్‌లను రిటర్న్ గిఫ్టులుగా ఇచ్చారని తెలుస్తోంది. సెలబ్రిటీలంతా ఈ ఈవెంట్ కు హాజరైంది నిర్మాతతో ఉన్న అనుబంధంతో కాదని, ఈ రిటర్న్ గిఫ్టుల కోసమే వారు సంగీత్ కు వెళ్లారని ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్.
ఈ ఈవెంట్ కు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి(megastar Chiranjeevi), ఎన్టీఆర్(NTR)- లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranathi), నాగచైతన్య(Naga Chaitanya)- శోభిత ధూళిపాల(Sobhitha Dhulipala), వరుణ్ తేజ్(Varun Tej)- లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), నాగార్జున(Nagarjuna)- అమల(Amala), నితిన్(Nithin) తన భార్య, అక్కినేని అఖిల్(Akkineni Akhil), తన కాబోయే భార్య హాజరయ్యారు. ఇదే సంగీత్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కూడా వెళ్లాడనుకున్నారు కానీ ఆయన కేవలం దుబాయ్ లో జరిగిన మ్యాచ్ కోసమే వెళ్లాడు తప్ప ఎలాంటి ఈవెంట్ కు హాజరవలేదని తెలుస్తోంది.













