దసరా తర్వాత అసలు పరీక్ష.. బాక్సాఫీస్ వద్ద నిలబడేదెవరు?
దసరా సెలవులను టార్గెట్ చేసుకుని థియేటర్లలోకి వచ్చిన సినిమాల ఫ్యూచర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) నటించిన జైలర్2(jailer2), విజయ్ దేవరకొండ(Vijay devarakonda) రణబాలి(Ranabaali), ఆనంది(Aanandi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన గరివిడి లక్ష్మి(Garividi lakshmi), తరుణ్ భాస్కర్(Tharun Bhaskar) క్రేజీ కళ్యాణం(Crazy kalyanam) సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే వీటిలో క్రేజీ కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు జైలర్2 బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది. రణబాలి వీకెండ్ తో పాటూ దసరా సెలవుల్లోనూ పర్వాలేదనిపించగా, గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రలో మెరుగైన కలెక్షన్లు సాధిస్తోంది. ఇతర ఏరియాల్లో మాత్రం ఈ సినిమా సాధారణ స్థాయి ప్రదర్శనకే పరిమితమైంది.
దసరా సెలవులు ముగియడంతో ఈ మూడు సినిమాలకు ఇకపై అసలైన సవాల్ ఎదురుకానుంది. సెలవుల కారణంగా థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉండటంతో కలెక్షన్లపై ఇంపాక్ట్ పడొచ్చనే అంచనాలున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్ లో వచ్చిన కలెక్షన్లను నార్మల్ వర్కింగ్ డేస్‌లోనూ కంటిన్యూ చేయడం సినిమాలకు కీలకంగా మారనుంది. ఇప్పటివరకు నమోదైన కలెక్షన్లు ఒక ఎత్తయితే, సెలవులు లేని రోజుల్లో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ట్రెండ్ ఎలా ఉంటుందన్నది ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వచ్చే వీకెండ్ లో పెద్ద సినిమాల రిలీజ్లు లేకపోవడం ఈ సినిమాలకు కొంత కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అయితే అంతకంటే ముందు వచ్చే వీక్ డేస్‌లో కలెక్షన్లు ఎంతమేర నిలకడగా ఉంటాయన్నదే కీలకం. భారీ పెట్టుబడులతో రూపొందిన జైలర్2, రణబాలి సినిమాలు లాభాల దిశగా సాగాలంటే సెకండ్ వీకెండ్ లోనూ మంచి కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. గరివిడి లక్ష్మి కూడా తనకు స్ట్రాంగ్ ఏరియాల్లో ఇదే జోరును కొనసాగించాల్సి ఉంది. మొత్తంగా దసరా సందడి ముగిసిన తర్వాత ఈ సినిమాల అసలు బాక్సాఫీస్ సామర్థ్యం బయటపడనుంది.








