ఓ ఇంటి వాడవబోతున్న మెగా మేనల్లుడు?
మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి సందడి మొదలుకానుందా? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. మెగా హీరో సాయి దుర్గా తేజ్(Sai durgha tej) త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. ఆయన పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నవంబర్లోనే పెళ్లి వేడుక జరగనుందనే ప్రచారం ఊపందుకోగా, దీనిపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా ప్రచారం ప్రకారం.. నవంబర్ 5న సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన చేసుకోబోయే అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలనే వార్త కూడా వినిపిస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ పెళ్లి ఫిక్స్ అయినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ పెళ్లి ప్రేమ వివాహమా, కుటుంబ సభ్యులు కుదిర్చిన సంబంధమా అనే విషయంపై క్లారిటీ లేదు. వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పరిమిత స్థాయిలో నిర్వహించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేవరకు వీటిని రూమర్లుగానే చూడాలి.
ఇవి కూడా చదవండి
మరోవైపు సినిమాల విషయానికొస్తే.. విరూపాక్ష(Virupaksha) తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సాయి తేజ్, సంబరాల ఏటి గట్టు(Sambarala yeti gattu) సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒకవైపు కెరీర్లో కొత్త సినిమాలతో ముందుకు సాగుతూనే, మరోవైపు పర్సనల్ లైఫ్ కు సంబంధించి వినిపిస్తున్న వార్తలతో సాయి దుర్గా తేజ్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.








