ఓటీటీలో ది ప్యారడైజ్.. 24 నిమిషాల ఎడిటింగ్ తో కొత్త వెర్షన్!
నేచురల్ స్టార్ నాని(nani) హీరోగా, శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) రూపొందించిన ది ప్యారడైజ్(the paradise) డిజిటల్ రిలీజ్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. థియేటర్లలో రిలీజైన వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ ఎడిషన్‌ను 24 నిమిషాలు తగ్గించారు. దీంతో థియేటర్లలో 2 గంటల 54 నిమిషాల రన్ టైమ్ తో ప్రదర్శితమైన ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై 2 గంటల 30 నిమిషాలకే పరిమితం కానుంది. తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఓటీటీ ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా కథనంలో మార్పులు చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కథకు ఆటంకంగా మారే సీన్స్, కొన్ని హింసాత్మక ఘట్టాలను తొలగించడం ద్వారా సినిమాను మరింత వేగంగా నడిపించే ప్రయత్నం చేసినట్లు డిస్కషన్ జరుగుతోంది. అయితే, ఏ సీన్స్ ను తొలగించారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
థియేట్రికల్ రిలీజ్ టైమ్ లో సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, నాని క్యారెక్టరైజేషన్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మార్పులతో కూడిన కొత్త వెర్షన్ ఆడియన్స్ ముందుకు రావడంతో మరోసారి ఈ సినిమాపై డిస్కషన్ మొదలైంది. థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ కు భిన్నంగా డిజిటల్ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరిస్తారా? తగ్గించిన నిడివి సినిమాకు ప్లస్ అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో లభించే ఆదరణే ఈ కొత్త వెర్షన్‌కు కీలకం కానుంది.








