నరసింహా సీక్వెల్‌పై రజినీకాంత్ కొత్త కండిషన్
సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) కెరీర్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సినిమాల్లో నరసింహా (narasimha) ఒకటి. స్ట్రాంగ్ స్టోరీ, పవర్ఫుల్ క్యారెక్టర్లు, నీలాంబరి పాత్ర చుట్టూ నడిచే సంఘర్షణ ఈ సినిమాను ప్రేక్షకులకు చిరస్మరణీయంగా మార్చాయి. ఇప్పుడు ఈ క్లాసిక్ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కోలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. డైరెక్టర్ కేఎస్ రవికుమార్(KS Ravikumar) ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నట్లు సమాచారం.
ఈ సీక్వెల్లో నీలాంబరి(neelambari) పునర్జన్మ అంశాన్ని ప్రధానంగా తీసుకొని డైరెక్టర్ స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనను రజినీకాంత్‌కు వినిపించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నరసింహా రీరిలీజ్‌కు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై డిస్కషన్ కు మరింత ఊతమిచ్చింది. అయితే పాత సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సీక్వెల్ విషయంలో రజినీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా నేటి ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగా కథ, స్క్రీన్‌ప్లే ఉండాలని రజినీకాంత్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కేఎస్ రవికుమార్ కథలో అవసరమైన మార్పులు చేసే పనిలో ఉన్నారని టాక్. అయితే సీక్వెల్‌ను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారు? మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ ను మళ్లీ రిపీట్ చేయగలరా? అనే ప్రశ్నలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.








