తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘ఫుడ్ డ్రైవ్ 2026’
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మిడ్ అట్లాంటిక్ యువ స్వచ్ఛంద సేవా విభాగం (Mid Atlantic Youth Volunteers) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ‘ఫుడ్ డ్రైవ్ 2025’ కార్యక్రమం ప్రారంభమైంది. స్థానిక సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తానా ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
చెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ (Chester County FoodBank) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 6 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది.ఇందులో భాగంగా, పెన్సిల్వేనియాలోని హనీ బ్రూక్, చెస్ట్నట్ రిడ్జ్ (Chestnut Ridge, Honey Brook, PA) ప్రాంతంలో అక్టోబర్ 24 మరియు 25 తేదీలలో మధ్యాహ్నం 12:00 నుండి 3:00 గంటల మధ్య ప్రత్యేక ఆహార సేకరణ (Drop-off) నిర్వహిస్తున్నారు. విరాళాలు ఇవ్వదలుచుకున్నవారు 237 చాస్టిన్ డ్రైవ్ (237 Chastin Dr.) వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో తమ వస్తువులను అందించవచ్చు.
సేకరించాల్సిన ఆహార పదార్థాలు
బియ్యం మరియు పాస్తా
సాల్సా మరియు కాండిమెంట్స్ (Salsa & condiments)
పప్పుధాన్యాలు (ఎండినవి మరియు డబ్బాల్లో నిల్వ చేసినవి)
డబ్బాల్లో నిల్వ చేసిన ట్యూనా మరియు చికెన్
వంట నూనెలు (ఆలివ్ & కెనోలా ఆయిల్)
తృణధాన్యాలు (Cereal & Whole grain)
పండ్లు (ఎండినవి మరియు జ్యూస్‌లో నిల్వ చేసిన డబ్బా పండ్లు)
రెడీ-టు-ఈట్ మీల్స్ మరియు సూప్‌లు (తక్కువ సోడియం, తక్కువ/చక్కెర లేనివి ప్రాధాన్యత)
ఆన్ లైన్ ద్వారా కూడా విరాళాలు ఇవ్వొచ్చు..
ఇవి కూడా చదవండి
నేరుగా కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి విరాళాలు ఇవ్వలేని వారు ఆన్ లైన్ ద్వారా కూడా తమ విరాళాలను అందించవచ్చు. ఈ సౌలభ్యాన్ని కూడా కల్పించారు. దీనికోసం https://tana.org/donation/tana/107 లింక్‌ను సందర్శించి లేదా పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా విరాళాలు అందించవచ్చు.
ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పోట్లూరి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, మిడ్ అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కాంతేటి, ఫుడ్ డ్రైవ్ కోఆర్డినేటర్ గోపి వాగ్వల, యూత్ ఫుడ్ డ్రైవ్ చైర్లు వ్యోమ్ క్రోథపల్లి, సోహన్ సింగు మరియు యువ నాయకులు ఎంతో ఉత్సాహంగా శ్రమిస్తున్నారు.








