కరోనా వైరస్ దెబ్బకు రూ.2,500 కోట్ల నష్టం లో సినీ పరిశ్రమ
కరోనా వైరస్ దెబ్బకు టోటల్ సినీ పరిశ్రమకు అన్ని విధాలా ఇప్పటికే 2,500 కోట్ల నష్టం వాటిల్లిందని పరిశ్రమ ప్రముఖులు వాపోతున్నారు. సినిమాలు నిర్మిస్తే లాభాల పంట పండటం ఖాయం అంటూ నిర్మాతలంతా కూడా భారీ బడ్జెట్ పెడుతూ వుంటారు. ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండగ సమయాల్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
పండుగలతో సంబంధం లేకుండా సమ్మర్ స్పెషల్ మూవీస్ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటాయి. కానీ ఈ సారి విశ్వవ్యాప్తంగా ప్రతీ దేశాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు సమ్మర్ కలెక్షన్స్ అన్ని కుదేలయ్యాయి. ఓ పక్క షూటింగులు ఆగిపోవడం తో ఇప్పటికే ప్రారంభించిన సినిమాలకు నిర్మాతలు వడ్డీలు ఎలా కట్టాలో ఎలా పూర్తి చెయ్యాలో అని అయోమయం లో వున్నారు. కరోనా నీకిది తగునా?













