Thandel: పాన్ ఇండియాను టార్గెట్ చేసిన తండేల్
నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా తండేల్(Thandel). గీతా ఆర్ట్స్2(Geetha Arts2) బ్యానర్ రూపొందిస్తున్న ఈ సినిమా నిజ జీవిత ఘటనలతో తెరకెక్కుతుండటంతో ఆడియన్స్ లో చాలా ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయిన భారతీయ మత్స్యకారుని జీవిత కథ ఆధారంగా తండేల్ రూపొందుతుంది.
పీరియాడికల్ లవ్ యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న తండేల్ లో ఎమోషన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని చిత్ర యూనిట్ మొదటి నుంచి ఊరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మలయాళ వెర్షన్ ను కూడా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లతో పాటూ ఒకేసారి రిలీజ్ చేస్తారని సమాచారం.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తుండగా ఈ నెల 26న తండేల్ ట్రైలర్(Thndel Trailer) ను రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ నెలాఖరు నుంచి ప్రమోషన్స్ ను వేగవంతం చేసి పాన్ ఇండియా లెవెల్ లో చిత్ర యూనిట్ అంతా కలిసి తండేల్ ను ప్రమోట్ చేయనుంది.













