Eesha Rebba: లెహంగాలో అందమే అసూయ పడేలా తెలుగమ్మాయి

ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు పెద్దగా గుర్తింపు ఉండదు. తెలుగమ్మాయి అయ్యి టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో ఈషా రెబ్బా (Eesha Rebba) కూడా ఒకరు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఈషా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈషా, అమీ తుమీ, విస్మయం, బ్రాండ్ బాబు లాంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత వీర రాఘవ లోనూ కనిపించి మెప్పించింది. అయితే ఎన్ని సినిమాల్లో నటించినా అమ్మడుకి కోరుకున్న స్టార్ స్టేటస్ మాత్రం దక్కడం లేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేసే ఈషా తాజాగా విజయ దశమి సందర్భంగా లెహంగాలో మరింత సంప్రదాయంగా కనిపించింది. పీచ్ కలర్ లెహంగా, దానికి తగ్గ జ్యుయలరీ ధరించి సింపుల్ హెయిర్ స్టైల్ లో ఎంతో చూడముచ్చటగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందం కూడా అసూయ పడుతుందనేలా ఈషా కనిపిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.