మిథాలీ పాత్రలో తాప్సి
రాహుల్ ఢోలాకియ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షబాష్ మిథు. తాప్సీ పన్ను టైటిల్ రోల్ పోషిస్తుంది. సాండ్ కీ ఆంఖ్ తర్వాత నటిస్తున్న సినిమా ఇదే. భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో బాల్ కొట్టి ఫోరా? సిక్సా? అని ఆతృంగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది తాప్సీ. మహిళల కోసం నిలబడాల్సిన సమయం అని పేర్కొంటూ ఈ చిత్ర నిర్మాణ సంస్థ వియోకామ్ ఈ పోస్టర్‌ను ట్విట్ చేసింది. ఈ చిత్ర దర్శకుడు గతంలో షారుఖ్ నటించిన రాయీస్ చేశారు. ఈ చిత్రం వచ్చ ఏడాది ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.













