చందూ ముండేటి డ్రీమ్ హీరోల లిస్టులో సూర్య
కార్తికేయ2(karthikeya2)తో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుకున్న డైరెక్టర్ చందూ ముండేటి(chandoo mondeti).. ఇప్పుడు కథల ఎంపికలో మరింత పెద్ద పరిధిని టార్గెట్ చేస్తున్నారు. తన కెరీర్లో కలిసి వర్క్ చేయాలనుకునే కొద్దిమంది హీరోల్లో తమిళ స్టార్ సూర్య(Suriya) కూడా ఉన్నారని చందూ స్వయంగా వెల్లడించారు. కార్తికేయ2 సక్సెస్ తర్వాత సూర్యకు ఓ కథను కూడా వినిపించినట్లు తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అయినప్పటికీ సూర్యతో సినిమా చేయాలనే ఆలోచనను చందూ వదులుకోలేదని స్పష్టమవుతోంది.
తండేల్(thandel)తో నాగచైతన్య, సాయిపల్లవిలతో మరో సక్సెస్ఫుల్ జర్నీ చేసిన చందూ.. ఇప్పుడు మరింత భారీ స్థాయి సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి(rana daggubati), అక్షయ్ కుమార్(Akshay kumar) కాంబినేషన్లో మహాకాళ్(mahakaal) అనే ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నారు. ఉజ్జయిని మహాకాళ్ ఆలయ నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను పెంచుతోంది. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ(Sanjay leela bhansali) అందించిన కథతో సినిమా చేయనున్నట్లు కూడా చందూ వెల్లడించారు.
ఈ క్రమంలో సూర్యతో చందూ ముండేటి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగిన నేపథ్యంలో.. ఇది కేవలం డైరెక్టర్ కోరికగా కాకుండా ఫ్యూచర్ లో కార్యరూపం దాల్చే అవకాశం ఉన్న కాంబినేషన్‌గా కనిపిస్తోంది. మహాకాళ్, భన్సాలీ ప్రాజెక్ట్ వంటి భారీ సినిమాల తర్వాత చందూ సూర్యతో చేతులు కలిపితే.. అది ఆయన కెరీర్లో మరో కీలకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.








