సూర్య క్రష్ ఎవరంటే?
ఎంత సెలబ్రిటీలైనా వారికి కూడా నచ్చిన వాళ్లు, క్రష్ ఉంటారు. హీరోగా ఎంతో మంది అమ్మాయిల డ్రీమ్ బాయ్ అయిన కోలీవుడ్ స్టార్ హీరో(Suriya) సూర్యకు కూడా ఓ సెలబ్రిటీ క్రష్ ఉన్నట్లు ఇప్పుడు వెల్లడైంది. రీసెంట్ గా బాలకృష్ణ(balakrishna) హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్(Unstoppable) షో కు సూర్య గెస్టుగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్ లో బాలయ్య(Balaiah), సూర్యను తన క్రష్ గురించి అడిగాడు. ఆ ప్రశ్నకు సూర్య సమాధానం చెప్పకపోయినా తన అన్న క్రష్ ఎవరో కార్తీ(Karthi) ఫోన్ కాల్ ద్వారా వెల్లడించాడు. సూర్యకు ఓ హీరోయిన్ అంటే చాలా ఇష్టమని చెప్పిన కార్తీ, సూర్య ఎంత వద్దన్నా సరే బాలయ్య కోరిక మేరకు ఆ హీరోయిన్ ఎవరో వెల్లడించాడు. సీనియర్ హీరోయిన్ గౌతమి(Gauthami) అంటే యంగ్ ఏజ్ లో పడి చచ్చిపోయేవాడట సూర్య.
జెంటిల్ మ్యాన్(Gentle Man) సినిమాలోని చికుబుకు రైలే(Chikubuku Raile) సాంగ్ లో గౌతమిని చూసి సూర్య ఫ్లాట్ అయిపోయాడని కార్తీ వెల్లడించాడు. ఈ విషయం చెప్తున్నప్పుడు కార్తీని నువ్వు కార్తీ కాదురా కత్తి అని సూర్య వ్యాఖ్యానించడం విశేషం. కార్తీ, తాను చాలా చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాళ్లమని, ఎప్పుడూ గొడవ పడుతూ ఉండే వాళ్లమని చదువు కోసం కార్తీ యూఎస్ వెళ్లినప్పుడు చాలా బాధ పడ్డానని, ఈ మూడేళ్లలోనే తమ మధ్య బంధం బలపడిందని సూర్య తెలిపాడు.













