శరణ్‌కుమార్ కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన కృష్ణ
ప్రముఖ నటులు కృష్ణ, విజయనిర్మల కుటుంబం నుంచి పరిచయం అవుతున్న కథానాయకుడు శరణ్‌కుమార్. ఆయన ప్రధాన పాత్రధారిగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ఎం.సుధాకర్‌రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ కేశనకుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడు మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని కథానాయకుడి లుక్‌ని ప్రముఖ నటులు కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ శరణ్ లుక్‌కి సంబంధించిన ప్రచార చిత్రం ఆసక్తికరంగా ఉంది. కథానాయకుడిగా తన పరిచయానికి తగ్గ కథనే ఎంచుకున్నట్టు సృష్టమవుతోంది. శరణ్ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడనే నమ్మకం నాకుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ శరణ్‌కి తప్పకుండా విజయాన్ని అందించే చిత్రమిది అన్నారు. ఛాయాగ్రహణం: చైతన్య కందుల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కళ : కె.వి.రమణ.













